నాటుసారా తాగి ఇద్దరి మృతి


కోయిలకుంట్ల (కర్నూలు) : బంధువుల ఇంట్లో దశ దినకర్మలకు వెళ్లిన ఇద్దరు యువకులు నాటుసారా పూటుగా తాగి  మృతిచెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దినం(దశదినకర్మ) జరుగుతుండటంతో.. అక్కడికి వెళ్లిన చంద్రయ్య(27), దాసరిమద్ది(28) అనే ఇద్దరు యువకులు నాటుసారా తాగడంతో.. అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top