తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌: టీటీడీ

TTD Says Alipiri Toll Gate To Go FASTag Way Soon - Sakshi

సాక్షి, తిరుమల: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద ‘ఫాస్టాగ్‌’ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అలిపిరి టోల్‌గేట్‌ వద్ద ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికీ ఫాస్టాగ్‌ ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక వీలైనంత తర్వలో ఫాస్టాగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో ఫాస్టాగ్‌ విధానాన్ని అనుసరించే తొలి దేవాలయ పాలకమండలిగా టీటీడీ ఖ్యాతి గడించనుంది. కాగా ఇప్పటికే కేంద్రం టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: పండుగపూట ఫాస్టాగ్‌ పరేషాన్‌

హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్‌ విక్రయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top