గణేష్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం .8 నుంచి రా.9 వరకు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు లక్డీకాపూల్ వరకే అనుమతిస్తున్నారు.
ఇక చార్మినార్ వైపు వెళ్లే సిటీ, జిల్లాల బస్సులు అఫ్జల్‌గంజ్ వరకే అనుమతిస్తుండగా, లింగంపల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వరకే అనుమతి ఉంది. హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు కోఠి వరకే అనుమతిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే వస్తాయి.
వరంగల్ నుంచి వచ్చే జిల్లాల బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జంటనగరాల్లో అదననపు ఎంఎంటీఎస్ రైళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలనుంచి ఎల్లుండి ఉదయం నాలుగు గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. అలాగే ఆర్టీసీ కూడా నిమజ్జనం సందర్భంగా అదనంగా 360 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.