ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.00 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగరపోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు.
ఆ మూడు ప్రధాన ఈద్గాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలలోగా మీర్ఆలం, బాలంరాయి, సికింద్రబాద్ ఈద్గాలకు చేరుకోవాలని పోలీసులు ముస్లిం సోదరులకు సూచించారు. ప్రార్ధనల సమయంలో ఈద్గాల వైపు సాధారణ వాహనాలను కూడా అనుమతించమన్నారు. ప్రార్ధనలు జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.