తమిళ కూలీల అరెస్ట్‌ : 67 ‘ఎర్ర’దుంగలు స్వాధీనం | three tamil workers arrested in seshachalam forest area 67 red sandals surrendered | Sakshi
Sakshi News home page

తమిళ కూలీల అరెస్ట్‌ : 67 ‘ఎర్ర’దుంగలు స్వాధీనం

Feb 8 2017 9:51 AM | Updated on Sep 5 2017 3:14 AM

తమిళ కూలీల అరెస్ట్‌ : 67 ‘ఎర్ర’దుంగలు స్వాధీనం

తమిళ కూలీల అరెస్ట్‌ : 67 ‘ఎర్ర’దుంగలు స్వాధీనం

ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న తమిళ కూలీలు మరోసారి రెచ్చిపోయారు.

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న తమిళ కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై కూలీలు బుధవారం రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు తమిళ కూలీలను అరెస్ట్‌ చేశారు.

వారి వద్ద నుంచి 67 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 మంది తమిళ కూలీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పరారైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement