శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దొంగలు కలకలం సృష్టించారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దొంగలు కలకలం సృష్టించారు. గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు రెండు, ఒక పోలేరమ్మ ఆలయాల్లోకి చొరబడిన దుండగులు హుండీలను పగులగొట్టారు. రూ.లక్షకుపైగా నగదును అపహరించుకు పోయారు. బుధవారం ఉదయం గ్రామస్తులిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.