'తుపాను నష్టంపై నివేదిక అందజేశాం' | the report of cyclone hand over to central committee, says prattipati pullarao | Sakshi
Sakshi News home page

'తుపాను నష్టంపై నివేదిక అందజేశాం'

Nov 28 2014 5:15 PM | Updated on Sep 2 2017 5:17 PM

హుదూద్ తుపాను వల్ల రూ. ఇరవై వేలకు పైగా నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

విశాఖ: హుదూద్ తుపాను వల్ల రూ. ఇరవై వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాలుగు జిల్లాల్లో తుపాను నష్టం రూ. 21, 908 కోట్లు జరిగినట్లు అంచనా వేసి ఆ నివేదికను కేంద్ర కమిటీలోని సభ్యులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకూ రూ. 7,500 కోట్లను రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు ప్రత్తిపాటి స్పష్టం చేశారు.


కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే  కేంద్ర బృందాలు గురు, శుక్రవారాల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement