కల్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కల్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక హనుమంతరాయుడు(45) అనే రైతు బలవన్మరణం చెందాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పు తీర్చే దారిలేక హనుమంత రాయుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.