బైక్ దొంగల ముఠా అరెస్టు | The bike gang of thieves arrested | Sakshi
Sakshi News home page

బైక్ దొంగల ముఠా అరెస్టు

Jan 13 2015 1:32 AM | Updated on Aug 11 2018 8:12 PM

బైక్ దొంగల ముఠా అరెస్టు - Sakshi

బైక్ దొంగల ముఠా అరెస్టు

నలుగురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసినట్లు పిడుగురాళ్ళ పట్టణ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.

మాచవరం: నలుగురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసినట్లు పిడుగురాళ్ళ పట్టణ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.  మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లుట్ల జంక్షన్‌లో వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మోర్జంపాడు గ్రామానికి చెందిన గుణపాటి చంద్రశేఖరరెడ్డి, కోర్ని సీతారామయ్య, మేకల గోవిందు, పిడుగురాళ్ళమండలం పందిటివారిపాలెంకు చెందిన బైలడుగుల పిచ్చయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా 15 ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు చెప్పారని పేర్కొన్నారు.  

రూ.9 లక్షల విలువైన 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు  తెలిపారు. మాచవరం, పిడుగురాళ్ళ, రాజుపాలెం, బెల్లంకొండ, మేళ్లచెరువు, దుర్గి, గురజాల, కారంపూడి గ్రామాల్లో ఇళ్ల ముందు రోడ్లపై ఉంచిన ద్విచక్రవాహనాలను నిందితులు దొంగిలించారని, వాటిలో నాలుగు వాహనాలను విక్రయించడానికి వెళుతుండగా పట్టుకున్నామని చెప్పారు.

వీటితోపాటు చంద్రశేఖరరెడ్డి గృహంలో ఐదు, పిచ్చయ్య గృహంలో ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మాచవరం ఎస్‌ఐ ఆవుల హరిబాబు మాట్లాడుతూ చెడు అలవాట్లకు బానిసై సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement