గజ.. గజ

Temperatures Down in West Godavari - Sakshi

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

తగ్గిన విద్యుత్‌ వాడకం

రాత్రి 8 గంటలకే నిర్మానుష్యంగా గ్రామీణ రహదారులు

పశ్చిమగోదావరి, దెందులూరు: జిల్లాలో చలితీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులు పెరిగాయి. దీంతో ప్రజలు గజ.. గజ వణుకుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు చలిమంటలు వేసుకుని చలిపులి నుంచి సంరక్షించుకుంటున్నారు.

నాలుగు డిగ్రీలకు పైగా తగ్గిన ఉష్ణోగ్రతలు
జిల్లాలో గత వారం రోజులుగా రాత్రిపూట 19 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. పగటి పూట 25 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కంటే దాదాపు నాలుగు డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏటా సాధారణంగా డిసెం బర్‌ నుంచి చలితీవ్రత పెరుగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా నవంబర్‌ నుంచే చలి విజృంభించింది. గతేడాదితో పోలిస్తే రెండు డిగ్రీల వరకు చలితీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పెథాయ్‌ తుపాను కారణంగా వాతావరణం బాగా చల్లబడింది. అప్పటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. చలితీవ్రతకు పగలు కూడా ప్రజలు స్వెట్టర్లు ధరించాల్సి వస్తోంది. రాత్రివేళ రాకపోకలను తగ్గించారు. స్వెట్టర్లు, రగ్గులు, బొంతలు, మాస్క్‌లు, మంకీ క్యాప్‌ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

తగ్గిన విద్యుత్‌ వినియోగం
చలి కారణంగా జిల్లాలో విద్యుత్‌ వినియోగం భారీగా తగ్గింది. ఏసీలు, కూలర్లు, లైట్లు, ఫ్యాన్‌ల వినియోగం జిల్లాలో గణనీయంగా తగ్గింది. చలి తీవ్రతకు ఉబ్బసం, ఆయాసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, షుగర్‌ వ్యాధిగ్రస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీటికి తోడు చిన్నారులకు అంటువ్యాధులు త్వరితగతిన తగ్గకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు.

పొగమంచుతో రవాణా అస్తవ్యస్తం
పొగమంచు కారణంగా రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొVýæ మంచు దట్టంగా కురుస్తోంది.  దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిలో ప్రయాణించే భారీ వాహనాలకు ఎదుట వెళ్లే వాహనాల జాడ తెలియడం లేదు.  దీంతో పలుచోట్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొVýæమంచు కారణంగా జిల్లాలో Výæత నాలుగు రోజుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top