అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి | Telugu student died in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Sep 1 2014 3:33 AM | Updated on Apr 4 2019 3:25 PM

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన కిష్టంశెట్టి సాయికృష్ణ అనే విద్యార్థి ఆదివారం సాయంత్రం అమెరికాలో మృతి చెందాడు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన కిష్టంశెట్టి సాయికృష్ణ అనే విద్యార్థి ఆదివారం సాయంత్రం అమెరికాలో మృతి చెందాడు. బోస్టన్‌లో ఎంఎస్ చదవడానికి గత ఏడాది వెళ్లిన సాయికృష్ణ ..ఆదివారం స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా శ్వాస ఆడక మృతి చెందాడు. సాయికృష్ణతో పాటు మరో నలుగురు ఇదే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. సాయికృష్ణ కుటుంబం 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. సాయికృష్ణ మృతి చెందినట్టుగా స్వగ్రామంలోని అతని నాయనమ్మకు సమాచారమందింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement