రాష్ట్ర విభజన ప్రక్రి య పూర్తి కాకముందే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలని అక్కడి కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అధిష్టానానికి టీ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రి య పూర్తి కాకముందే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలని అక్కడి కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలలలే ఉన్నందున తెలంగాణలో పార్టీపరంగా భారీ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్న విభజనకు ముందే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.
తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలంతా కలిసి అధినేత్రి సోనియాగాంధీకి దీనిపై లేఖ రాయాలని తాజాగా నిర్ణయించారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పి.నర్సారెడ్డి, కె.యాదవరెడ్డి, పొన్నం ప్రభాకర్, బి.కమలాకరరావు తదితర తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో బొత్సను కలిసి చర్చించారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదానికి ముందే టీపీసీసీని ఏర్పాటు చేసేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కోరారు.