టీడీపీ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ | tdp lost its originality, says padmaraju | Sakshi
Sakshi News home page

టీడీపీ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ

Mar 20 2014 4:51 PM | Updated on Mar 18 2019 7:55 PM

టీడీపీ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ - Sakshi

టీడీపీ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇప్పుడు లేదని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వ్యాఖ్యానించారు.

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇప్పుడు లేదని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వ్యాఖ్యానించారు. అనేకమంది కాంగ్రెస్ నాయకులను టీడీపీలో చేర్చుకోవడంతో టీడీపీ కాస్తా ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఆయన అన్నారు. వలస నాయకులను ఆహ్వానిస్తున్న చంద్రబాబు నాయుడికి నష్టం తప్పదని చెప్పారు.

ఇక టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అయితే కేవలం  రాజకీయ లబ్ధి కోసమే ఉద్యోగుల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని పద్మరాజు మండిపడ్డారు. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు అక్కడ, తెలంగాణ వాళ్లు ఇక్కడ మాత్రమే ఉద్యోగాలు చేసుకోవాలని, అంతేతప్ప ఆప్షన్లు ఉండబోవని కేసీఆర్ బుధవారం నాడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రుద్రరాజు దానిపై స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement