మంచి ప్రాజెక్టులకు టీటీడీ సహకారం | support good projects in TTD | Sakshi
Sakshi News home page

మంచి ప్రాజెక్టులకు టీటీడీ సహకారం

Mar 14 2014 7:04 AM | Updated on Sep 2 2017 4:42 AM

సమాజానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్‌లతో ముందుకు వ స్తే పరిశోధనలకు టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ ఆయుర్వేద విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

తిరుపతి, న్యూస్‌లైన్ : సమాజానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్‌లతో ముందుకు వ స్తే పరిశోధనలకు టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ ఆయుర్వేద విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల 31వ వార్షికోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఈవో మాట్లాడుతూ పరిశోధనలకు పెద్దపీట వేయాలని విద్యార్థులకు సూచించారు.

అందుకు అనువైన అవకాశాలు స్విమ్స్, బర్డ్స్, ఇతర ఆస్పత్రుల మధ్య ఉన్న ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు మాత్రమే ఉన్నాయన్నా రు. ఎక్కడాలేని విధంగా ఇక్కడ ఆస్పత్రికి అనుబంధంగా ఫార్మసీ కూడా ఉండడం విశేషమన్నారు. ఆయుర్వేద విద్యార్థులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, చదువులు పూర్తిచేసిన వారు ఉద్యోగం కోసం డిస్పెన్సరీలు ప్రారంభించాల్సిన ఆవసరం లేదన్నారు.

సమాజానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్‌లతో ముందుకు వస్తే పరిశోధనలకు టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుందఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల అభివృద్ధికి టీటీడీ అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ ప్రసంగిస్తూ ఆయుర్వేద కళాశాలలో పరిశోధనలకు స్విమ్స్ సహకరిస్తుందని చెప్పారు.

తిరుపతి ఆయుర్వేద కళాశాలలో చదివిన వారికి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలని, యూజీ, పీజీ సీట్ల పెంపునకు సహకరించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాజయ్య కోరారు. కార్యక్రమంలో ఆయుర్వేదం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతి, కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామిరెడ్డి, స్టూడెంట్ రెప్రజెంటేటివ్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కళాశాల ఆవరణలో నిర్మించిన ధ న్వంతరీ హాల్‌ను ఈవో గోపాల్ ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement