‘సూపర్ స్పెషాలిటీ’ ఫలితాలు విడుదల | super speciality medical admissions results released | Sakshi
Sakshi News home page

‘సూపర్ స్పెషాలిటీ’ ఫలితాలు విడుదల

Sep 10 2014 2:25 AM | Updated on Sep 2 2017 1:07 PM

సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల నిమిత్తం గతనెల 31వ తేదీన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి.

విజయవాడ: సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల నిమిత్తం గతనెల 31వ తేదీన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. 

మొత్తం 13 స్పెషాలిటీ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్లకు నిర్వహించిన ఈ పరీక్షకు 554 మంది హాజరుకాగా, ఆరుగురి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. మిగిలిన 548 మంది అభ్యర్థుల్లో 451 మంది ప్రవేశార్హత సాధించి నట్లు పేర్కొన్నారు. 16న కౌన్సెలింగ్‌కు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్ ntruhs.ap.nic.inలో పొందుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement