రోడ్డెక్కిన విద్యార్థులు

Students Protest For Buses - Sakshi

పాలకొండ రూరల్‌  : బస్సులు సక్రమంగా రావటంలేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. పాలకొండ–పార్వతీపురం రహదారిలో అట్టలి గ్రామం వద్ద గురువారం బైఠాయించారు. ఆర్టీసీ యాజమాన్యం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాకేష్‌వర్మ, పవన్‌కుమార్, రాకేష్, శ్రావణి తదితరులు మాట్లాడుతూ వందలాది రాయితీ బస్‌పాసులు అందించిన ఆర్టీసీ సం స్థ తమకు అవసరమైన సర్వీసులు నడపటం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యం తాము బస్సుల కోసం ఎదురుచూసి ఇబ్బందులు పడుతున్నామన్నారు. సకాలంలో బస్సులు రాక, వచ్చిన బస్సులు స్టాప్‌ల వద్ద ఆపకపోవటంతో కళాశాలలకు, పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్నామన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేక రోడ్డెక్కాల్సి వచ్చిందని వాపోయారు. అంతర్‌ రాష్ట్ర రహదారిపై విద్యార్థులు నిరసనకు దిగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు స్పందించి సర్ధిచెప్పటంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు.

ఖండ్యాం మార్గంలో ఆర్టీసీ బస్సు నడపాలి

రేగిడి : మండలంలోని ఉంగరాడమెట్ట నుంచి ఖండ్యాం వెళ్లే ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు నడపాలంటూ పలు గ్రామాల విద్యార్థులు గురువారం ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాలకొండ నుంచి ఖం డ్యాం వరకు నడుస్తున్న బస్సు ఇటీవల అధికా రులు నిలిపివేయడంతో ప్రధాన రహదారికి ఆనుకున్న గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా విష యం తెలుసుకున్న ఎస్సై జీ భాస్కరరావు తన సిబ్బందితో వెంటనే అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.

ఖండ్యాం మార్గంలో బస్సు వేయించేందుకు ఆర్టీసీ డీఎంతో మాట్లాడుతానని, విద్యార్థులంతా కళాశాలలకు వెళ్లిపోవాలని చెప్పడంతో వీరంతా ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో ఖండ్యాం, వన్నలి, ఉప్పర్నాయుడువలస, చాటాయివలస, వండానపేట, కేఎంవలస, సంతకవిటి మండలం కొండగూడెం, మాదవరాయపురం తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top