గుంతకల్ ఎమ్యెల్యేకు సమైక్య సెగ | Sri Krishnadevaraya University Students JAC protests infront of Gunatakal MLA Madhusudan Gupta | Sakshi
Sakshi News home page

గుంతకల్ ఎమ్యెల్యేకు సమైక్య సెగ

Nov 15 2013 1:11 PM | Updated on Sep 2 2017 12:38 AM

రాష్ట విభజన అనివార్యమని గుంతకల్ ఎమ్మెల్యే మదుసూదన్ గుప్తా స్పష్టం చేశారు.

రాష్ట విభజన అనివార్యమని గుంతకల్ ఎమ్మెల్యే మదుసూదన్ గుప్తా స్పష్టం చేశారు. అందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి  తెచ్చినట్లు వెల్లడించారు. అనంతపురంలోని ఎస్కేయూనివర్శిటీకి వచ్చిన గుప్తాను ఆ యూనివర్శిటీ జేఏసీ అడ్డుకుంది. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని జేఏసీ గుప్తాను నిలదీసింది.

 

ఆ క్రమంలో ఆయన వాహనాన్ని జేఏసీ వ్యిద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్దులను చెదరగొట్టేందుకు యత్నించారు. దాంతో గుప్తా విద్యార్థుల వద్దకు వెళ్లి రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేసే దిశగా తాము చేసే ప్రయత్నాలను వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement