ప్రత్యేక రైళ్లు | Special Trains | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లు

Oct 3 2014 12:52 AM | Updated on Sep 2 2017 2:17 PM

ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్లు

రైళ్ల రద్దీ దృష్ట్యా మరో రెండు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్-సాంత్రగచ్చి, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నట్టు తూర్పు కోస్తా రైల్వే గురువారం ప్రకటించింది.

విశాఖపట్నం: రైళ్ల రద్దీ దృష్ట్యా మరో రెండు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్-సాంత్రగచ్చి, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నట్టు తూర్పు కోస్తా రైల్వే గురువారం ప్రకటించింది. దసరాతో పాటు దీపావళిని పురస్కరించుకుని ఈ రెండు రైళ్లను నడుపుతోంది.
 
సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్ : అక్టోబర్ 5వ తేదీన ప్రయాణికుల రద్దీ దష్ట్యా ఆ రోజు సికింద్రాబాద్-విశాఖ మధ్య సూపర్‌ఫాస్ట్(02742) ప్రత్యేక రైలును నడుపుతున్నారు. 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-సికింద్రాబాద్(02741) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖలో ఈ నెల 6వ తేదీ రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
 
 ప్రీమియం రైళ్లు
 సికింద్రాబాద్-సాంత్రగచ్చి(02774) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 20న ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7.15 గంటలకు విశాఖకు చే రి మళ్లీ 7.35 గంటలకు బయల్దేరి 21వ తేదీ ఉదయం 9.45 గంటలకు సాంతగచ్చి చేరుతుంది.
     
 సాంత్రగచ్చి-సికింద్రాబాద్(02773) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21న రాత్రి 8.40 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 9.50 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement