Sakshi News home page

ఆర్డీఎస్ ఎత్తు పెంపును అడ్డుకోవాలి

Published Sun, Jul 13 2014 3:56 AM

should be stop to increase of rds high

 కోసిగి రూరల్: రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఎత్తును పెంచకుండా రాష్ట్ర ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య కోరారు. కోసిగి మండలం అగసనూరు సమీపంలోని ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చేపట్టడంతో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని శనివారం రామచంద్రయ్యతో పాటు సంఘం జిల్లా అధ్యక్షుడు బీజీ మాదన్న, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ య్ సందర్శించారు.

ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం సీడబ్ల్యూసీ అనుమతి లేకుం డా ఆర్డీఎస్ ఎత్తును పెంచడానికి వీలు లేదన్నారు. ఆర్డీఎస్ ఎత్తును అర అడు గు మేరకు పెంచితే దిగువనున్న కర్నూ లు, కడప జిల్లాల రైతులకు తాగు, సా గునీటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కలిసి ఆర్డీఎస్ ఎత్తు పెంపకంపై న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఎస్‌ను సందర్శించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గిడ్డయ్య, రైతు సంఘం ఉపాధ్యక్షుడు సత్యన్న, సీపీఐ కోసిగి మండలం నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement