హాస్టల్ వార్డెన్‌పై లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి (చిత్తూరు జిల్లా): తిరుపతి నగరంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో పనిచేస్తున్న మహిళా వార్డెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన అదే వసతి గృహానికి చెందిన పురుష వార్డెన్‌లను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు.
సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో ఎస్సీ, ఎస్టీ బాలబాలికల సంక్షేమ వసతిగృహంను ప్రభుత్వం నిర్వహిస్తుంది. బాలికల వసతి గృహంలో శశికళ అనే మహిళ వార్డెన్‌గా వ్యవహరిస్తోంది. అదేవిధంగా బాలుర వసతి గృహం వార్డెన్‌లుగా శ్రీనివాసులురెడ్డి , సదాశివ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా మహిళా వార్డెన్ శశికళపై ఇద్దరు పురుష వార్డెన్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితురాలు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అలిపిరి సీఐ శ్రీనివాసులు పై ఇద్దరు నిందితులను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.