సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం | Seemandhra MPs “Sankalp Diksha” starts at indra park | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం

Jan 3 2014 10:29 AM | Updated on Sep 27 2018 5:59 PM

సీమాంధ్ర ఎంపీల  సంకల్ప  దీక్ష ప్రారంభం - Sakshi

సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు విడదీయలేరని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు విడదీయలేరని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం సంకల్ప దీక్ష చేపట్టారు.  సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఆ దీక్షలో పాల్గొన్నారు.

 

విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ పేర్కొన్నారు. సంకల్ప దీక్షలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశివరావులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు తమ సంకల్ప దీక్ష కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

 

సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్షకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలతోపాటు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సంకల్ప దీక్ష స్థలి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement