సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పడుతున్నారు.
సమైక్యాంధ్ర సమ్మె రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. రోజుకో కొత్త వర్గం ఈ సమ్మెలో భాగస్వామ్యం వహిస్తోంది. తాజాగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె బాట పడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు సీమాంధ్ర ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు సమ్మె నోటీసు అందించారు.
మరోవైపు ఉద్యోగుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. అధికారులందరూ తమకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు, కళాశాలలు తెరవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.