సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష వాయిదా | Seemandhra Congress Leaders Hunger Strike Postponed | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్ష వాయిదా

Sep 13 2013 2:53 AM | Updated on Jun 2 2018 4:41 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 48 గంటల పాటు హైదరాబాద్‌లో దీక్ష చేయాలని సంకల్పించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 48 గంటల పాటు హైదరాబాద్‌లో దీక్ష చేయాలని సంకల్పించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈనెల 3న అసెంబ్లీ ఆవరణలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఫోరం కన్వీనర్ శైలజానాథ్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనంలోపే 48 గంటల దీక్ష చేపడతామని ప్రకటించారు.

అయితే దీక్ష ఎక్కడ నిర్వహించాలో నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతోపాటు నిమజ్జనంలోపు దీక్షకు అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేయడంతో.. దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీక్ష ఎప్పుడు, ఎక్కడ చేపట్టాలనే విషయాన్ని శుక్రవారం వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement