ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఆవశ్యకతను గుర్తించి ఏర్పాటు చేసిన ఓటరు నమోదు ప్రక్రియ బీఎల్‌ఓల వ్యవహార శైలితో
ఓటర్ల జాబితాలో పాఠశాల విద్యార్థులు
Dec 26 2013 3:36 AM | Updated on Sep 2 2017 1:57 AM
సత్తెనపల్లిరూరల్,న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఆవశ్యకతను గుర్తించి ఏర్పాటు చేసిన ఓటరు నమోదు ప్రక్రియ బీఎల్‌ఓల వ్యవహార శైలితో అభాసుపాలవుతోంది. గ్రామాల్లో స్థానిక నేతలు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అందిపుచ్చుకున్నారు. బీఎల్‌ఓ లను ప్రలోభాలకు గురిచేస్తూ విద్యార్థులను సైతం ఓటర్లగా చేర్చే పనిలో పడ్డారు. గ్రామాల్లో లేని వారిని, పెళ్లి చేసుకొని ఇతర ఊళ్లకు వెళ్లిన ఆడపడుచులను నూతన ఓటర్లుగా చేర్పించారు.
మండలంలోని ధూళిపాళ్ళ గ్రామంలోనే సుమారు 200 మందికి పైగా అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదైనట్లు స్థానికులు గుర్తించారు. వీటిలో అదే గ్రామంలో హైస్కూల్లో 9,10 తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులు ఉండడం గమనార్హం. పైగా వీరంతా ఒక పార్టీకి చెందిన సానుభూతిపరులే కావడం మరో అంశం. ఇదే తీరు మండలంలోని గుడిపూడి, నందిగామ, పాకాలపాడు, రెంటపాళ్ళ గ్రామాలలోనూ నెలకొంది. ఓటర్ల జాబితాలోని తప్పులతడకలపై ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.
Advertisement
Advertisement