స్టీరింగ్‌ ఊడిన స్కూలు బస్సు | The Scary Bus Driver Loses The Steering | Sakshi
Sakshi News home page

స్టీరింగ్‌ ఊడిన స్కూలు బస్సు

Oct 13 2017 8:08 PM | Updated on Oct 13 2017 8:16 PM

దెందులూరు(పశ్చిమగోదావరి): దెందులూరు మండలం పోతునూరు గ్రామం సమీపంలో విశ్వకవి స్కూల్ బస్సు బోల్తా పడి 30మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్ ఊడి పోవడంతో అదుపు తప్పి పంట కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్ ఫిట్ నెస్ పై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిపేర్‌కు వచ్చిన బస్సును స్కూల్ యాజమాన్యం వాడుతోందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ బస్సు ప్రమాదానికి గురైందని, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement