ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే సౌమ్య | SC, with special focus on employment: MLA Soumya | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే సౌమ్య

Oct 25 2014 2:05 AM | Updated on Sep 15 2018 2:43 PM

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేసే విషయమై ప్రత్యేక దృష్టి సారిస్తానని నందిగామ శాసనసభ్యురాలు తంగి రాల సౌమ్య హామీ ఇచ్చారు.

గాంధీనగర్ : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేసే విషయమై ప్రత్యేక దృష్టి సారిస్తానని నందిగామ శాసనసభ్యురాలు తంగి రాల సౌమ్య  హామీ ఇచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కృష్ణా రీజియన్ 4వ మహాసభ శుక్రవారం జరిగింది. తొలుత రాజ్యాంగ నిర్మా త బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రావ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆమె మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు ఐకమత్యంగా ఉంటూ సమస్యలపై పోరాడాలని సూచించారు. కృష్ణా రీజినల్ మేనేజర్ జి.సుధేష్‌కుమార్, అసిస్టెంట్ డెరెక్టర్ బి.కమలాకర్‌రెడ్డిని ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఆర్టీసీ  ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం  నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  

జిల్లా  అధ్యక్షుడిగా బి. కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం.అబ్రహం, కోశాధికారిగా నానక్ ఎన్నికయ్యారు.  ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాడంకి ప్రతాప్ కుమార్, ఆడిట్ డిపార్టుమెంట్ డెప్యూటీ డెరైక్టర్ మేడేపల్లి  వరప్రసాద్, పి.దేవానందరావు   తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement