'పెద్ద మాదిగనని బాబు గతంలో చెప్పారుగా' | SC Categorization bill produce in ap assembly, demands Manda Krishna Madiga | Sakshi
Sakshi News home page

'పెద్ద మాదిగనని బాబు గతంలో చెప్పారుగా'

Dec 23 2014 2:36 PM | Updated on Sep 15 2018 3:07 PM

'పెద్ద మాదిగనని బాబు గతంలో చెప్పారుగా' - Sakshi

'పెద్ద మాదిగనని బాబు గతంలో చెప్పారుగా'

ఏపీ అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షడు మందకృష్ణ మాదిగ టీటీడీపీ నేతలను డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షడు మందకృష్ణ మాదిగ టీటీడీపీ నేతలను డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో టీడీఎల్పీలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి, ఎల్ రమణతో మందకృష్ణమాదిగ భేటీ అయ్యారు. అనంతరం మందకృష్ణ విలేకర్లతో మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు టీడీపీ డిమాండ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే తాను పెద్ద మాదిగనని ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా మందకృష్ణ టీడీపీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. తన డిమాండ్ను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని టీ.టీడీపీ నేతలు తనకు హామీ ఇచ్చారని మందకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement