విజయమ్మ దీక్షకు సమైక్యాంధ్ర జేఏసీ మద్దతు | Samaikyandhra JAC Support to YS Vijayamma Indefinite hunger strike | Sakshi
Sakshi News home page

విజయమ్మ దీక్షకు సమైక్యాంధ్ర జేఏసీ మద్దతు

Aug 15 2013 1:54 AM | Updated on Jun 2 2018 4:41 PM

సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ బుధవారం తెలిపారు.

సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా, కార్మికులందరూ విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ముందుకు రావాలని కోరారు. సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రులు, రాజకీయేతర ప్రముఖులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, రైతు నాయకులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శివాజీ తెలిపారు.
 
సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేసినా ఏపీఎన్జీవోలు స్వాగతిస్తారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
 - ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు
 
విభజన తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజ యమ్మ ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి, మరో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాలు చేయడం.. సీమాంధ్ర ప్రజలకు కొంత ఆత్మస్థైరం కలిగించింది. ఆమరణ దీక్ష చేపట్టాలని విజయమ్మ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె నిర్ణయం కాంగ్రెస్ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిస్తుందని ఆశిస్తున్నాం.
 - ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి
 
‘‘సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇతర పార్టీల నాయకులు సైతం ఆమె బాటలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిజాయతీగా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలి’’.
 -టి.వి.రామిరెడ్డి, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, గుంటూరు
 
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష సమైక్య ఉద్యమానికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, సీమాంధ్రలో అన్నివర్గాల ప్రజలు కదిలి చేస్తున్న ఆందోళనతో పాటు ఆమె చేపట్టనున్న ఆమరణ దీక్ష ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి పెంచడానికి తోడ్పడుతుంది.
 - ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి
 
విజయమ్మ ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నాం. దీక్షకు ఎన్జీవోలుగా మద్దతు ఇస్తాం. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలి.
 -గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
 కళ్లేపల్లి మధుసూదనరాజు
 
విభజనను నిరసిస్తూ జగన్, విజయమ్మ పదవులకు రాజీనామా చేయడం సాహసోతమైన నిర్ణయం. సీఎం కిరణ్, చంద్రబాబు మాత్రం పదవులకు రాజీనామా చేయకుండా సీమాంధ్రుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.
- ఎన్‌జీవో సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు దేవరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement