సాక్షి చానల్ ప్రసారాల పునరుద్ధరణ | sakshi tv Communications recovery | Sakshi
Sakshi News home page

సాక్షి చానల్ ప్రసారాల పునరుద్ధరణ

Jun 23 2016 12:47 AM | Updated on Aug 20 2018 8:27 PM

సాక్షి చానల్ ప్రసారాల పునరుద్ధరణపై విజయనగరం జిల్లా జర్నలిస్టుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది.

విజయనగరం మున్సిపాలిటీ : సాక్షి చానల్ ప్రసారాల పునరుద్ధరణపై విజయనగరం జిల్లా జర్నలిస్టుల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. కొద్ది రోజులుగా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం ద్వారా భావ స్వేచ్ఛహక్కును హరిస్తున్నారంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించిన విషయం విదితమే. జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక పోరాటం ఫలితంగా ప్రభుత్వం మరలా ప్రసారాలను పునరుద్ధరించింది.
 
  దీంతో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధి పీఎస్‌ఎస్‌వి ప్రసాద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, విజయనగరం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లికార్జునరావు, కాండ్రేగుల శేఖర్‌బాబు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గమిడి కోటేశ్వరరావు, శాంతి స్వరూప్, జాప్ సంఘం ప్రతినిధులు ఆదినారాయణ, అవనాపు సత్యనారాయణ తదితరులు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement