ఆయన ఉన్నపుడే ఆనందం | Ananda Gajapathi Raju Wife Interview | Sakshi
Sakshi News home page

ఆయన ఉన్నపుడే ఆనందం

Jul 17 2018 12:03 PM | Updated on Aug 20 2018 8:24 PM

Ananda Gajapathi Raju Wife Interview - Sakshi

సాక్షిప్రతినిధితో మాట్లాడుతున్న  సుధా గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు

విజయనగరం : విద్యే దైవం... విద్యే సర్వస్వం... విద్యలేని జీవి తం వ్యర్థం అని భావించారు. అందుకే విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. దేశ, విదేశాల్లోని యూనివర్శిటీల నుంచి డాక్టరేట్లు సాధించా రు. అంతేనా... విజయనగరానికి విద్యలనగరంగా పేరును సార్థకత చేయడానికి శతవిధాలా కృషి చేశారు. ఆయనే పూసపాటి వంశంలో ఆఖరి పట్టాభిషిక్త మహారాజైన పి.వి.జి.రాజు, కుసుమగజపతి దంపతుల పెద్దకుమారుడు పూసపాటి ఆనందగజపతిరాజు.

1950 జూలై 17న మద్రాసులో పుట్టిన ఆయన 1983లో ఎన్టీఆర్‌ పిలుపునందుకుని ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి... 1985, 1991లో బొబ్బిలి పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించారు. విద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా సేవలందించారు. సొంత ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి ఎమ్‌వీజీఆర్‌ ఇంజి నీరింగ్‌ కళాశాలను స్థాపించారు. విజయనగరానికి పీజీ సెంటర్‌ రావడానికి ప్రధాన కారకుడయ్యా రు.

ఆర్థికశాస్త్రంలో ఎంఏ 1973లో పట్టాతో పాటు పీహెచ్‌డీ చేసి 2009లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు. విద్యా రంగానికి చేస్తు న్న సేవలు గుర్తించి ఇండో అమెరికన్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ అందజేసింది. వంశపారపర్యంగా వస్తున్న 108 దేవాలయాలకు ధర్మకర్తగా పనిచేశారు. పాత్రికేయునిగా కొంతకాలం ఆంగ్ల దినపత్రికకు వ్యాసాలు రాశారు. మార్చి 26, 2016లో ఉదయం 8 గంటలకు విశాఖలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణానంతరం ఆయన సతీమణి, కుమార్తె ఒంటరివారయ్యారు. వారి గురిం చి పట్టించుకునేవారు కరువయ్యారు. మంగళవారం ఆనందగజపతిరాజు 68వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సతీమణి సుధా గజపతి రాజు ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మనసు విప్పి మాట్లాడారు. ఆనందగజపతిరాజుతో ఉన్న అనుభూతులను నెమరువేసుకున్నారు. ఆయన్నో మహర్షిగా అభివర్ణించారు. ప్రస్తుతం తమ పరిస్థి తి గురించి, భవిష్యత్తు గురించి తెలియజేశారు. 

ప్రజా సంక్షేమమే ధ్యేయం

వారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించేవారు. ఎప్పుడూ ఆయనకోసం ఆలోచించలేదు. మొదట్లో పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. ప్రజల కోసం ఎంవీజీఆర్‌ కళాశాల స్థాపించారు. ఆ సమయంలో నేను గర్భవతిని. కళాశాల కోసం బ్యాంకులో లోన్‌ పెట్టడం నాకు తెలుసు. ఎక్కువగా మిడిల్‌ క్లా స్‌ మహిళల కోసమే ఆలోచించేవారు. ‘వారు ఇం ట్లో అందరినీ చూసుకుని ఉద్యోగానికి వస్తున్నారు. మనం అన్ని సౌకర్యాలు కల్పించాలి’ అనేవారు.

మహిళలంటే ఎంతో గౌరవం. మహిళలు ఏడిస్తే సహించే వారు కాదు. నేనన్నా, పాపన్నా ఎంతో ఇ ష్టం. ప్రపంచంలో  ఏ భర్త అలా చూడరు. ఎక్కువగా కూతురు అంటే ఇష్టం. ఆయన ఎకానిమిక్స్‌ మీద పుస్తకాలు రాశారు. ఫ్లోరిడాలో డాక్టరేట్‌ వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. సింహాచలంలో ఆయన ఉన్నప్పుడు ప్రారంభించిన పనులే ఇప్పుడు పూర్తవుతున్నాయి. 

మాకు మేమే మిగిలాం

ఆయన తరువాత నాకు అంతా చీక టే. ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందిన వారెవరూ ఇప్పుడు మా ముఖాలు చూడరు. ఈ రోజు కూడా మాకు కారు డ్రైవర్లు కూడా లేరు. అయినా సింహాద్రి అప్పన్న, పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మాపై ఉన్నాయి. ఆయన అనుకున్న మంచి పనులు ఎలాగైనా పూర్తి చేయాలని ఉంది. కొంతైనా చేయడానికి ప్రయత్నం చేస్తాను. పాపను బాగా చదివించాలనుకునే వారు.

విజయనగరానికి తాగునీటి వరాన్నిచ్చిన అప్పలకొండ ఊర్మిళ దేవి పేరునే పాపకు పెట్టారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేశారు. ఆయన పుట్టినరోజుకు అందరూ వచ్చేవారు. ఇ ప్పుడు మాన్సాస్‌ వారు కూడా కనిపించరు. మా న్సాస్‌కు సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఇప్పుడు ఆ సంస్థ వారు చేసే జయంతి కార్యక్రమాలకు కూడామమ్మల్ని పిలవరు.

రాజకీయాల్లోకి వస్తే సేవచేస్తా...

కొన్ని సమయాల్లో ఎందుకు బతకడం అనిపించేది. ఆయన ఉన్నంతవరకు అందరి గురించి చెప్పేవారు. న్యాయం ఏంటో తెలియకపోతే రాజు ఎలా అవుతారు. కానీ ఇక్కడెవరూ న్యాయంగా లేరు. పాపకు అన్ని విషయాలూ చెప్పేవారు. చిన్నపిల్లకు చెప్పవద్దనేదాన్ని. ఆయన వల్లనే వీళ్లు పైకి వచ్చారు. కానీ నా గురించి, పాప గురించి వీళ్లు ఆలోచించరు. మేం బతకకూడదు అనే చెత్త మెం టాలిటీ మనుషులు వాళ్లు.

ఆయన చనిపోయిన తరువాత మాకు పుట్టినిల్లు సింహాచలం కాబట్టి అక్కడికే వెళ్లాను. ఆ కాటేజీ ఖాళీ చేయవద్దని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. కానీ అదీ మిగల్లేదు. రాజకీయాల్లోకి రావడానికి ఆలోచిస్తున్నాను. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆయన భార్యగా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే వస్తాను.

నాన్నే సర్వం: ఊర్మిళ దేవి

నాకు డాడీతో ఎటాచ్‌మెంట్‌ ఎక్కువ. 11 సంవత్సరాలు చేతిమీదనే నిదురపుచ్చేవారు. ఇప్పుడు మా బంధువులతో ఎటువంటి రిలేషన్స్‌ లేవు. అంతా నటనా ప్రపంచంలా ఉంది. అమ్మకు, నాకూ బంగ్లాయే ప్రపంచం. నేనే ఇప్పుడు యూకే యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం వెళుతున్నాను. తాను చదివిన యూనివర్శిటీలో నేను చదవాలనేది డాడీ కల. నేనూ డాడీ రాత్రిళ్లు నిద్రపోకుండా కబుర్లు చెప్పుకునేవాళ్లం.

ప్రజలకు మంచి చేయడం గురించే చెబుతుండేవారు. మనల్ని నమ్ముకున్నవారికి కష్టం వస్తే ఆలోచించకుండా సాయం చేయాలనేవారు. ఆయన మా నుంచి దూరమైన తర్వాత జీవితంలో మొదటిసారి పైడితల్లి అమ్మవారికి మొక్కుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు అడగకుండానే అన్నీ డాడీ ఇచ్చేవారు. దేవుడ్ని కూడా ఏమీ కోరుకునే అవసరం రానివ్వలేదు.

సాయం చేయకుండా నిద్రపోయేవారు కాదు...

ఆయన ఎవరికైనా సహాయం చేయాలనుకుని అది పూర్తిచేయకపోతే పడుకునేవారు కాదు. కానీ ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇప్పుడు పద్ధతులు అన్నీ మారాయి. నీతి, నిజాయితీ లేదు. పాలిటిక్స్‌ నాకు సరిపడవ్‌ అనే వారు. అన్నమయ్యలాగే కృష్ణమయ్య కూడా రచనలు చేశారు. ఇప్పుడవి కిమ్స్‌ లైబ్రరీలో ఉన్నాయి.

వాటిని మన దేశానికి తెప్పించి పాటలుగా మలచాలని చాలా ప్రయత్నించారు. కొన్ని సీడీలు కూడా విడుదలయ్యాయి. లయన్స్‌ కమ్యూనిటీ ఆస్పత్రి కోసం సింహాచలం మేడను కేవలం రూపాయి అద్దెకు ఇచ్చేశారు.  పూసపాటి వంశంలో ఆలక్‌ నారాయణకు, ఆనందగజపతికి ‘ఫ్‌లైయింగ్‌ లైసెన్సు’ ఉంది. విజయనగరంలో వైద్య కశాశాల స్థాపించాలని నిరంతరం తపించారు. ఆయన బతికుంటే ఇపాటికి ఆ కళాశాల వచ్చుండేది. 

1
1/1

 ఆనంద గజపతిరాజు, సుధా గజపతిరాజు  దంపతులు(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement