ఆర్‌టీఐ సామాన్యుడి ఆయుధం | RTI common weapon | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఐ సామాన్యుడి ఆయుధం

Jul 26 2014 3:49 AM | Updated on Sep 2 2017 10:52 AM

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సామాన్యుడికి ఆయుధం లాంటిదని ఆ చట్టం రాష్ట్ర కమిషనర్ లామ్ తాంతియా కుమారి తెలిపారు.

  •      రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా
  •      మూడు రోజుల్లో 142 ఆర్‌టీఐ కేసుల విచారణ
  • తిరుపతి కార్పొరేషన్: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సామాన్యుడికి ఆయుధం లాంటిదని ఆ చట్టం రాష్ట్ర కమిషనర్ లామ్ తాంతియా కుమారి తెలిపారు. తిరుపతిలో మూడు రోజులుగా నిర్వహించిన ఆర్‌టీఐకి సంబంధించిన కేసుల విచారణ శుక్రవారం ముగిసింది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 142 కేసులను ఆమె విచారించారు.

    సంతృప్తికరమైన సమాచారం వచ్చిన 21 కేసులను క్లోజ్ చేశారు, 16 కేసులను పరిష్కరించారు. 105 కేసులకు సంబంధించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐవో)లు కమిషన్ ఎదుట హాజరు కాకపోవడం, సమాచారం ఇవ్వక పోవడం, కమిషన్‌ను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి కారణాలతో సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిమాన విధించారు. అందులో తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ఒకరు.
     
    అనంతరం విలేకరుల సమావేశంలో కమిషనర్ తాంతియా కుమారి మాట్లాడారు. సమాచారం ఇవ్వడంలో తహశీల్దార్లు పూర్తిగా విఫలం చెందుతున్నారని మండిపడ్డారు. పైగా సమాచారం కోసం వచ్చే వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అలాంటి వారిని కమిషన్ కఠినంగా శిక్షిస్తుందన్నారు. కార్వేటినగ రానికి చెందిన తులసీ అనే మహిళ ఓ భూమి వివరాలు కావాలని తహశీల్దార్‌ను కోరగా హరిప్రసాద్ అనే వ్యక్తి ఆమెను చంపుతామని బెదిరించాడన్నారు. పైగా తన వద్దకు విచారణకు వచ్చిన తులసిని వెంబడిని అతడిని అరెస్టు చేయించామన్నారు.

    ఇలాంటి సంఘటనలను అధికారులు ప్రోత్సహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల నుంచి హుండీల రూపంలో కోట్లాది రూపాయలు వసూ లు చేస్తున్న టీటీడీ ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అన్నారు. కోర్టులో కేసులున్నాయన్న సాకుతో సమాచారం చెప్పనంటే కుదరదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఆకలితో అలమటించే పూజారులు, ధూప దీప నైవేద్యానికి కూడా నోచుకోని ఆలయాలు అనే కం ఉన్నాయని వాటికి సమాధానం చె ప్పి తీరాలన్నారు. ఆర్‌టీఐపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement