సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.95లక్షలు మంజూరు | Rs. 95 lakhs sanction to ap cm camp office, orders issued to B Prasada rao | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంపు కార్యాలయానికి రూ.95లక్షలు మంజూరు

Aug 26 2015 6:55 PM | Updated on Aug 18 2018 6:18 PM

విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ భవనంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రూ.95.28 లక్షలు మంజూరు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. ప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ : విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ భవనంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రూ.95.28 లక్షలు మంజూరు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. ప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనానికి మరమ్మతులు చేయడం, ఆధునికరించడానికి రూ.63.58 లక్షలు, యాక్సెస్ కంట్రోల్ ఉపకరణాలు ఏర్పాటుకు రూ.31.7 లక్షలు మంజూరు చేశారు.

వీటికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నిఘా విభాగం అదనపు డీజీని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement