ఒంగోలులో భారీ చోరీ | robbery in ongole district | Sakshi
Sakshi News home page

ఒంగోలులో భారీ చోరీ

Jul 16 2015 7:16 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఒంగోలులో భారీ చోరీ - Sakshi

ఒంగోలులో భారీ చోరీ

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గోదావరి పుష్కరాలకు వెళ్లిన వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది.

ఒంగోలు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గోదావరి పుష్కరాలకు వెళ్లిన వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పుష్కరాలకు వెళ్లి గురువారం తిరిగి వచ్చిన వ్యాపారి ప్రభాకర్ గుప్తా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు.

ఒంగోలు పట్టణంలోని చేజర్ల లక్ష్మణచారి వీధిలోని ఏనుగు చెట్టు వద్ద ఉండే ప్రభాకర్ గుప్తా రెండు రోజుల క్రితం గోదావరి పుష్కరాలకు వెళ్లి గురవారం తెల్లవారుజామున తిరిగి వచ్చాడు. కాగా, దొంగలు ఇంటిలో నుంచి 200 సవర్ల బంగారం, రూ. 4 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, రూ. 2లక్షల నగదును దోచుకున్నట్లు వ్యాపారి తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement