దురుద్దేశంతోనే.. | Rims tramaker Applications responsible for department Causa turpis | Sakshi
Sakshi News home page

దురుద్దేశంతోనే..

Jan 17 2014 3:44 AM | Updated on Sep 2 2018 4:46 PM

రిమ్స్ ట్రామాకేర్ విభాగం పోస్టుల భర్తీ బాధ్యతను రిమ్స్ అధికారులు దురుద్దేశంతోనే స్వీకరించారని సమాచారం. వాస్తవానికి ఈ

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రిమ్స్ ట్రామాకేర్ విభాగం పోస్టుల భర్తీ బాధ్యతను రిమ్స్ అధికారులు దురుద్దేశంతోనే స్వీకరించారని సమాచారం. వాస్తవానికి ఈ బాధ్యత జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి(డీసీహెచ్‌ఎస్)ది. అయితే పోస్టులను సుదీర్ఘఠ  కాలంగా భర్తీ చేయడం లేద నే సాకుతో రిమ్స్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులను ఒప్పించి ఆ బాధ్యతను తమ భుజానికెత్తుకున్నారు. దీనివెనుక జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో రిమ్స్‌లో జరిగిన పలు పోస్టుల భర్తీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిని పట్టించుకోకుండా తాజా నియామకాల బాధ్యతను జిల్లా అధికారులు వారికి అప్పగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
 
 కలెక్టర్ ఆదేశాల బేఖాతరు
 తమను కట్టడి చేసేవారెవరూ లేకపోవటంతో రిమ్స్ అధికారులు మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. గతంలో ఆడియాలజిస్ట్‌గా ఓ మహిళను నియమించాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా, రాష్ట్ర వైద్య విద్యామంత్రి సూచించినా దానిని అమలు చేయలేదు. ఆరు నెలల డిప్లమా పూర్తిచేసిన ఓ వ్యక్తిని ఆడియాలజిస్ట్ పోస్టులో కొనసాగిస్తున్నారు. ఆడియాలజీలో నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన మహిళను ఆ పోస్టులో నియమించాలని ఆదేశించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. చివరకు చేసేది లేక కలెక్టరే.. సదరం ద్వారా ఆ మహిళను నియమించి రిమ్స్‌కు కేటాయించారు. డిప్లమా పూర్తిచేసిన వ్యక్తి రూ.పదివేలకుపైగా జీతం పొందుతుండగా సదరం ద్వారా నియమితురాలైన మహిళకు రూ.5 వేలే ఇస్తుండటం గమనార్హం. తాము చేస్తున్న పనుల్లో ఎందరికో భాగస్వామ్యం ఉందని కొందరు రిమ్స్ అధికారులు బహిరంగంగా చెబుతుండటం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement