రేణుకా చౌదరి తెలంగాణ బిడ్డా?: పొన్నం | Renuka Chowdary's presence irks Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

రేణుకా చౌదరి తెలంగాణ బిడ్డా?: పొన్నం

Nov 5 2013 1:47 PM | Updated on Sep 2 2017 12:18 AM

రేణుకా చౌదరి  తెలంగాణ బిడ్డా?: పొన్నం

రేణుకా చౌదరి తెలంగాణ బిడ్డా?: పొన్నం

ఏఐసీసీ అధికారి ప్రతినిధి రేణుకా చౌదరిపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ :  ఏఐసీసీ అధికారి ప్రతినిధి రేణుకా చౌదరిపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ బిడ్డనని చెప్పుకునేందుకు రేణుకా చౌదరికి అర్హత లేదని ఆయన  అన్నారు. మంగళవారమిక్కడ సీఎల్పీ కార్యాయలంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పనిలో పనిగా పొన్నం.... ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర జేఏసీ కన్వీనర్లా కిరణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబునాయుడుకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని పొన్నం వ్యాఖ్యానించారు.  రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరుగుతుందంటున్న సీమాంధ్ర టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఎందుకు స్పందించటం లేదని ఆయన ప్రశ్నించారు. మునిగే నావలో తోక పట్టుకుని ఈదవద్దని పొన్నం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement