అమల్లోకి రేషన్ పోర్టబులిటీ | ration portability in progress | Sakshi
Sakshi News home page

అమల్లోకి రేషన్ పోర్టబులిటీ

May 7 2015 4:55 AM | Updated on Sep 3 2017 1:33 AM

ఈ-పాస్ విధానంలో భాగంగా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఏ రేషన్ దుకాణం నుంచైనా వినియోగదారులు సరుకులను...

రేషన్‌డీలర్లు పనితీరును మెరుగుపర్చుకోవాలి
ఈ-పాస్ సర్వర్ కెపాసిటీని పెంచుతాం
పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ రవిబాబు

 
గూడూరు టౌన్ : ఈ-పాస్ విధానంలో భాగంగా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఏ రేషన్ దుకాణం నుంచైనా వినియోగదారులు సరుకులను తీసుకువెళ్లేలా రేషన్ పోర్టబులిటీని బుధవారం నుంచి అమలు చేస్తున్నామని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ రవిబాబు తెలిపారు. గూడూరులోని 3వ వార్డులో ఉన్న 11వ రేషన్ దుకాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

పట్టణంలోని 11వ నంబరు చౌక దుకాణాంలో అతి తక్కువమంది రేషన్ తీసుకున్నారని, అదే సమయంలో 13లో 60 మంది వరకు సరుకులు తీసుకున్నట్లు సమాచారం రావడంతో దుకాణాన్ని పరిశీలించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1.50 లక్షల మంది ఈ-పాస్ విధానం ద్వారా సరుకులు తీసుకుంటున్నారని, దీనిని 3 లక్షలకు పెంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ-పాస్ సర్వర్ కెపాసిటీని పెంచి సరుకులను అందజేయడంలో అలసత్వం లేకుండా చూస్తామన్నారు. ఆయన వెంట డీఎస్‌ఓ ధర్మారెడ్డి, ఆర్డీఓ రవీంద్ర, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement