రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు! | rajahmundry - hyderabad flight charge goes up to 17k | Sakshi
Sakshi News home page

రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!

Oct 17 2014 10:13 AM | Updated on Sep 2 2017 3:00 PM

రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!

రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!

రాజమండ్రినుంచి హైదరాబాద్ విమాన ఛార్జీ 3,500 నుంచి 17వేలు చేసేశారు.

హుదూద్ తుఫాను కారణంగా విశాఖ విమానాశ్రయం దెబ్బతినడంతో ఒక్కసారిగా రాజమండ్రి సమీపంలో ఉన్న మధురపూడి విమానాశ్రయం నుంచి రాకపోకలు పెరిగిపోయాయి. దాంతో గిరాకీ పెరిగిందని రాజమండ్రి నుంచి హైదరాబాద్కు టికెట్ ఉన్నట్టుండి 17 వేల రూపాయలు చేసేశారు. మామూలు రోజుల్లో అయితే ఈ ఛార్జి కేవలం 3,500 రూపాయలు మాత్రమే.

సాధారణంగా ఏవైనా పండుగ సీజన్లు వచ్చినా, ప్రయాణం తేదీ బాగా దగ్గర పడినా. విమాన ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైనమిక్ ఫేర్ సిస్టం అంటారు. కానీ.. ఒక విమానాశ్రయం పనిచేయకపోవడం వల్ల ఇలా జరగడం మాత్రం ఇదే మొదటిసారి. విశాఖ నుంచి వెళ్లాల్సిన వాళ్లు కూడా అక్కడినుంచి రోడ్డు/రైలు మార్గాల్లో మధురపూడి చేరుకుని, ఇక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement