మద్యం మత్తులో.. రైల్వే గేట్ కీపర్ | Railway Gate Keeper Duties intoxicated alcohol | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో.. రైల్వే గేట్ కీపర్

Oct 5 2014 2:58 AM | Updated on Sep 2 2017 2:20 PM

మద్యం మత్తులో.. రైల్వే గేట్ కీపర్

మద్యం మత్తులో.. రైల్వే గేట్ కీపర్

రైల్వే గేట్ కీపర్ మద్యం మత్తులో విధులు నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గేట్లు సక్రమంగా వేయకపోవడంతో వెళ్లాలో.. వద్దో తెలియక రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి.

భీమసింగి(జామి) :రైల్వే గేట్ కీపర్ మద్యం మత్తులో విధులు నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గేట్లు సక్రమంగా వేయకపోవడంతో వెళ్లాలో.. వద్దో తెలియక రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రయాణికులు అందిం చిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమసింగి రైల్వే గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న గేట్‌మన్ డి. రాజు మద్యం మత్తులో ఉండి గేట్ సగం వేసి వదిలేశాడు. గేటు సగం తీసి ఉండడంతో కొంతమంది వాహనదారులు రాకపోకలకు ప్రయత్నించారు. ఈ సమయంలో రైళ్లు వెళ్తుండడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికుళ్లో ఆందోళన నెలకొంది. కొంతమంది సల హా మేరకు వాహనదారులు గేటుకిరువైపులా వాహనా లు నిలిపివేయడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
 
 గేట్‌మన్ రాజు రైల్వే సిగ్నల్స్ కూడా  ఇవ్వకపోవడంతో పాటు ఇతర రైల్వే స్టేషన్ల నుంచి వస్తున్న ఫోన్లు కూడా తీయకపోవడంతో కోరుకొండ  రైల్వే స్టేషన్ సూపర్ వైజర్  కె.శ్రీనివాస్, పీ డబ్ల్యూ గోవిందరావు, తదితర  రైల్వే  సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్‌మన్ రాజు మద్యం మత్తులో ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపై శాఖాపరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న జామి ఎస్సై ఎం. ప్రశాంత్‌కుమార్ వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గేట్‌మన్ తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Advertisement
Advertisement