కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను మోసం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను మోసం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ అమలును టీడీపీ సర్కారు పూర్తిగా విస్మరించిందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రఘువీరా రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ నిధులకు కోత పెట్టిందన్నారు. అంగన్ వాడీలు ఈ నెల 13న తలపెట్టిన ఆందోళనకు, ఈనెల 17న చలో అసెంబ్లీకి కాంగ్రెస్ మద్దతిస్తోందన్నారు.
గతంలో అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇటీవల నెల్లూరులో అంగన్ వాడీలు వినతిపత్రాలు తీసుకోకుండా పోలీసులతో అణచివేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో డ్వాక్రా రుణాల మాఫీకి నిధులు కేటాయించాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.