క్విడ్‌ప్రోకో, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓఎంసీ కేసుల విచారణను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది.
హైదరాబాద్: క్విడ్‌ప్రోకో, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓఎంసీ కేసుల విచారణను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం క్విడ్‌ప్రోకో కేసులో కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పొందిన తర్వాత ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరు అయ్యారు. గత నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు, కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు హాజరుకావాలని షరతు విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరు కాలేదు.
ఓఎంసి కేసులో గాలి జనార్ధన రెడ్డి, అలీఖాన్, శ్రీనివాస రెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. వారికి ఈ నెల 17వరకు రిమాండ్ పొడిగింది.