మేకపిల్లను మింగిన కొండచిలువ  | Python Swallows Goating At Koduru Forest In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మేకపిల్లను మింగిన కొండచిలువ 

Sep 8 2019 9:17 AM | Updated on Sep 8 2019 9:17 AM

Python Swallows Goating At Koduru Forest In Visakhapatnam - Sakshi

కర్రలతో కొండచిలువ నోటిని పొడిచి చంపిన దృశ్యం  

కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు.  

కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ సింగరాలపాడు అడవిలో శనివారం కొండచిలువ మేకపిల్లను మింగింది. సింగరాలపాడుకు చెందిన మేకల కాపర్లు  మేతకోసం మేకలను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు ఆరు అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేక పిల్లని మింగింది. కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు.  

Advertisement
 
Advertisement
Advertisement