హక్కుల పరిరక్షణకు ఆదివాసీలు ఉద్యమించాలి | Protection of the rights to the agitating Adivasis | Sakshi
Sakshi News home page

హక్కుల పరిరక్షణకు ఆదివాసీలు ఉద్యమించాలి

Aug 10 2013 4:50 AM | Updated on Sep 1 2017 9:45 PM

భారత రాజ్యాంగం ద్వార సంక్రమించిన హక్కుల పరిరక్షణకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలని కాకతీయ యూనివర్సిటీఅసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ పిలు పు నిచ్చారు.

 నయీంనగర్, న్యూస్‌లైన్ : భారత రాజ్యాంగం ద్వార సంక్రమించిన హక్కుల పరిరక్షణకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలని కాకతీయ యూనివర్సిటీఅసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ పిలు పు నిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదివాసీ జన చైతన్యవేదిక ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ముందుగా నబ్లిక్ గార్డెన్‌లో వనదేవతలైన సమ్మక్క-సారల మ్మలకు పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ నృత్యాల తో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభాస్థలికి చేరుకున్నారు. ఆదివాసీ జన చైతన్య వేదిక కన్వీన ర్ చుంచు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సి ఉందని, పాలక వర్గాలు చిన్నచూపుతో ఆదివాసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించా రు. హక్కులను కాలరాస్తూ అపారమైన ఖనిజసంపదను బడాపెట్టుబడిదారులకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డా రు. ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, రాజ్యాం గంలోని 5, 6వ షెడ్యూల్డ్‌ను ఖచ్చితంగా అమలు చేయాల ని, ఏజెన్సీలో వలస విధానాన్ని అరికట్టాలని, భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలని, మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని తదితర డిమాండ్లను సభలో తీర్మానించారు. ఈ సందర్భంగా మండల, జిల్లా స్థాయిలో చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, జిల్లాలో ఇటీవల ఎన్నికైన ఆదివాసీ సర్పంచ్‌లను, రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఆదివాసీ సంప్రదా య నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ), ఆదివాసీ జన చైతన్య వేదిక, రచయితల వేదిక, ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక, విశ్రాంత ఉద్యోగుల, విద్యార్థి, మహిళా సంఘాలు, గ్రాడ్యుయేట్స్ యూనియన్‌ల ప్రతిని ధులు వట్టం ఉపేందర్, పోలెం కృష్ణప్రసాద్, గుంటి పోచయ్య, నాగేశ్వర్‌రావు, గాంధీ కృష్ణారావు, సత్యనారయణ, సాంబశివరావు, ఆనం ద్, ఆగయ్య, కె.వీరమల్లు, లేగ నరేంద్రకుమార్, యాదగిరి, ఆగయ్య, డాక్టర్ శ్రీరాములు, సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. 
 
 స్వయం పాలనే ఆదివాసీల లక్ష్యం : ధర్మయ్య
 ఏటూరునాగారం : స్వయం పాలనతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యం.. లక్ష్య సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుకుల ధర్మయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం 32వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఆదివాసీ విద్యార్థులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించా రు. ఈ సందర్భంగా ధర్మయ్య మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకులం వరకు అన్ని ఆదివాసీ ప్రాంతాలను ప్రత్యే క జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా ఆదివాసీ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందివ్వకపోతే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కొమరం భీం ఆశయ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. అంతకు ముందు తుడుం దెబ్బ కార్యాలయంలో వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి ఆగబోయిన రవి ఆదివాసీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కొమురం నర్సయ్య, కొర్నిబెల్లి రాఘవరావు, పొడెం రత్నం, గొప్ప సమ్మారావు, పి.శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వర్లు, పి.ఆనందరావు, కోటయ్య, కె.భాస్కర్, క్రాంతికుమార్, ఎన్.లక్ష్మణ్‌రావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 
 
 దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి 
 ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చాలని నాయకపోడు సంఘం జిల్లా ఇన్‌చార్జ్ దబ్బ సుధాకర్ డిమాండ్ చేశారు. ఆకులవారిఘణపురంలోని లక్ష్మీదేవర ఆలయం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జి.నర్సయ్య, కె.వెంకటేశ్వర్లు, కె.రవీందర్, బి.సారయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement