రూ. 25 లక్షలకు టోపీ పెట్టిన పూజారి అరెస్టు | priest arrested for duping ladies in the name of pujas | Sakshi
Sakshi News home page

రూ. 25 లక్షలకు టోపీ పెట్టిన పూజారి అరెస్టు

Feb 25 2015 4:53 PM | Updated on Sep 2 2017 9:54 PM

పూజలు, యాగాలు పేరుతో మహిళల నుంచి 25 లక్షల రూపాయలు అక్రమంగా వసూలుచేసిన పూజారిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.

పూజలు,  యాగాలు పేరుతో మహిళల నుంచి 25 లక్షల రూపాయలు అక్రమంగా వసూలుచేసిన పూజారిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని ధర్మవరానికి చెందిన సుబ్రహ్మణ్య ఫణిశర్మను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.  గాజువాక, సీతమ్మధారకు చెందిన మహిళల ఫిర్యాదుతో  ఫణిశర్మను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో ఇన్నాళ్లుగా పూజల పేరుతో అమాయకులను మోసం చేసిన పూజారి సుబ్రహ్మణ్య ఫణిశర్మ బండారం బయటపడింది. పూజారి చేతిలో ఎంతో మంది మహిళలు మోసపోయారు. తాము ఏ విధంగా మోసపోయిందో పలువురు మహిళలు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement