గుంటూరు జిల్లాలో కల్తీపాల తయారీ కేంద్రాలపై పోలీసలు దాడులు నిర్వహించారు.
నర్సరావుపేట: గుంటూరు జిల్లాలో కల్తీపాల తయారీ కేంద్రాలపై పోలీసలు దాడులు నిర్వహించారు. జిల్లాలోని నర్సరావుపేటలో కల్తీపాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో శుక్రవారం దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా కల్తిపాలతో పాటు, పాల తయారికి వాడే ఆయిల్, పౌడర్, కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని నవోదయ నగర్‌లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ పాలధందాను నడుపుతున్నారు. ఈ రోజు దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.