శాంతిభద్రతల పరిరక్షణకు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని డీఐజీ అనిల్‌కుమార్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులే కీలకమన్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
శాంతిభద్రతల పరిరక్షణకు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని డీఐజీ అనిల్‌కుమార్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులే కీలకమన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2013 రెండో అర్ధవార్షికంలో నేరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోరాదని సిబ్బందికి సూచించారు. నేరాలను నమోదు చేయడంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. వారికి విధించే శిక్షలను చూసి నేరాలకు పాల్పడేవారిలో మార్పు రావాలన్నారు. ఇలా కేసులు నమోదయ్యేలా చూడాలన్నారు. భూములకు సంబంధించిన విషయాల్లో క్రైమ్ ఉంటేనే కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రతి కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్‌పీ తరుణ్‌జోషి సూచించారు. కేసులను కూలంకషంగా పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్భయ చట్టం కింద 48 కేసులు నమోదు చేశామన్నారు. మైనర్లపై 12 అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను వెంటనే డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్ సూచించారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.