టవేరా బోల్తా: ఏడుగురికి గాయాలు

Passengers Injured In Road Accident At Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద ఓ టవేరా కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి  తీవ​ గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో నలుగురి  పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వారు బెంగళూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top