ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తక్షణమే పర్మినెంట్ చేయాలని సీపీఎం ఏపీ కమిటీ డిమాండ్ చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తక్షణమే పర్మినెంట్ చేయాలని సీపీఎం ఏపీ కమిటీ డిమాండ్ చేసింది. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వేలాదిమంది ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించింది.
ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లు సుమారు పదివేల మందిని తొలగించాలని నిర్ణయించిందని, దీనిని విరమించుకోవాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం ఒక ప్రకటనలో ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ఉద్యోగుల సర్వీసు ఈనెల 30తో ముగియనుందని, తమను తిరిగి చేర్చుకుంటారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారని వివరించారు.