ఓఎన్‌జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికం భయాందోళనలకు గురవుతున్నారు.
అంతర్వేదిలో మళ్లీ గ్యాస్ లీక్
Jun 23 2017 9:40 AM | Updated on Sep 5 2017 2:18 PM
సఖినేటిపల్లి: ఓఎన్‌జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికం భయాందోళనలకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ శివారులోని 20వ నెంబర్ బావి నుంచి శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అవుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేస్తున్నారు. గ్యాస్ లీక్ ను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement