రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Oct 7 2015 6:08 PM | Updated on Apr 3 2019 7:53 PM

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎర్రగొండపాళెంకు చెందిన కృష్ణ(35) భార్య పుట్టినింటిలో ఉండడంతో చూసేందుకు బుధవారం మాచర్ల వచ్చాడు.

ఆర్టీవో కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కృష్ణ భార్య ప్రస్తుతం గర్భవతి. భార్యా పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యువాత పడడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement