టీచర్ల ఒకరోజు సమ్మె కాలం రెగ్యులరైజ్ | One day teachers strike to be regularized | Sakshi
Sakshi News home page

టీచర్ల ఒకరోజు సమ్మె కాలం రెగ్యులరైజ్

Feb 13 2014 12:51 AM | Updated on Nov 9 2018 5:52 PM

అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు 2012 ఫిబ్రవరి 28న జరిగిన సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు 2012 ఫిబ్రవరి 28న జరిగిన సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఒకరోజు ఆర్జిత సెలవును ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఆర్జిత సెలవు లేని వారికి భవిష్యత్‌లో రానున్న సెలవు సరెండర్ చేసే అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపా ధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
 
 5 వేల పోస్టులు అప్‌గ్రేడేషన్‌కు గ్రీన్ సిగ్నల్
 విద్యాశాఖ ప్రతిపాదనల మేరకు 2,500 పండిట్, 2,500 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ఆర్థిక శాఖ అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement